కాంగ్రెస్ లోకి మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..?
ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతారని ప్రచారం జరుగుతున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్న క్రమంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీఎంను కలవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే వారిద్దరూ నియోజకవర్గ సమస్యలపైనే సీఎంను కలిశారని గులాబీ పార్టీ శ్రేణులు చెబుతున్నా.. వాళ్లు కాంగ్రెస్ పార్టీ లో చేరుతారనే ప్రచారం ఉంది. తాజా పరిణామాలపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.