కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారుల మృతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో లో విషాదం నెలకొంది. కారు డోర్లు లాక్ కావడంతో ఆడుకుంటున్న తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4) ఊపిరాడక మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పసి పిల్లలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.