NewsTelangana

6వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ లీడ్‌

మునుగోడు ఉప ఎన్నికలో 6వ రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌ ఆధిక్యత సాధించింది. 6 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయిన తర్వాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఆధిక్యత 2169 ఓట్లకు చేరింది. ఈ రౌండ్‌లో మునుగోడు రూరల్‌ ఓట్లను లెక్కించారు.ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6016 ఓట్లు, బీజేపీకి 5378 ఓట్లు పడ్డాయి. 1, 4, 5, 6 రౌండ్లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆధిక్యత పొందారు. 2, 3 రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి ఆధిక్యత సాధించారు. మొత్తానికి ప్రతి రౌండ్‌కు ఉత్కంఠత పెరుగుతోంది. 6 రౌండ్ల తర్వాత టీఆర్‌ఎస్‌కు మొత్తం 38,521 ఓట్లు, బీజేపీకి 36,352, కాంగ్రెస్‌కు 11,894, బీఎస్పీకి 1237 ఓట్లు లభించాయి.