బీజేపీపై టీఆర్‌ఎస్ ఛార్జీషీట్
కేంద్రప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. చేనేత, ఖాదీపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీ అన్నారు. ఏ ప్రధాని చేయని తప్పు మోదీ చేశారన్నారు. బీజేపీ ఏం చేసింది.. ఏం చేస్తుందో చెప్పకుండా సీఎం కేసీఆర్‌పై బురద చల్లుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. వ్యక్తిగత దోషణలు తప్ప 8 ఏళ్లలో బీజేపీ ఏ అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోర్‌సిస్ సమస్యపై ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. మునుగోడులో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయని, మునుగోడు ప్రజల తరుఫున ఛార్జీషీట్ వేస్తున్నామని చెప్పారు. ఫ్లోర్‌సిస్ సమస్యపై, చేనేత, ఖాదీపై జీఎస్టీ వేసినందుకు, మోటర్ల మీటర్లపై, నీటి పంపకాల్లో తెలంగాణకు అన్యాయం చేసినందుకు, పెట్రోలు, డిజీల్, గ్యాస్ రేట్లు పెంచినందుకు, ఛార్జీషీట్ వేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేల కోనుగోలు విషయంలో దొంగ ఎవరో, దొర ఎవరో అందరికీ తెలిసిందన్నారు. ఫాంహౌస్ వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ఆ కేసు కోర్టు విచారణలో ఉన్నందున దానిపై నేను ఏమి మాట్లాడాలేనని మంత్రి కేటీఆర్ చెప్పారు.