ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళి
మాజీ సీఎం, ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు, అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ మనవడు, ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. వారితో పాటు ఎన్టీఆర్ కుమారుడు, నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలక్రిష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

