కాకినాడలో విషాదం, ఆయిల్ ట్యాంకర్‌లో దిగి ఊపిరాడక ఏడుగురు మృతి
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి. రాగంపేటలో విషాదం చోటుచేసుకొంది. నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ ఆవరణలో ప్రమాదం జరిగింది. శుభ్రం చేసేందుకు ఆయిల్ ట్యాంకర్‌లో దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ఒకరి తర్వాత ఒకరు ట్యాంకర్‌లో దిగి ఊపిరాడక మరణించారు. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులుగా గుర్తించారు. మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు వాసులు. అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఘటన.