ముంబైలో కుండపోత వర్షం
దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కాగా నిన్న ముంబైలో కురిసిన కుండపోత వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా కేవలం 6 గంటల్లోనే 30 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు ముంబై మున్సిపల్ కార్పోరేషన్ వెల్లడించింది. ఈ భారీ వర్షాలతో పట్టాలపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో నిత్యం 30 లక్షల మంది ప్రయాణించే ముంబై లోకల్ ట్రైన్ సర్వీసులు ఆగిపోయాయి. కాగా మరో రెండు రోజులపాటు ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ముంబై మున్పిపల్ కార్పోరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు.