బాలకృష్ణ నుండి ఇది నేర్చుకోవాల్సిందే..డైరక్టర్
యంగ్ టాలీవుడ్ డైరక్టర్ గోపీచంద్ మలినేని, హీరో బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తాడు. ఎవరైనా బాలయ్య బాబును చూసి, వినయం, వినమ్రత నేర్చుకోవాల్సిందేనన్నారు గోపీచంద్. నిన్న హీరో బాలకృష్ణ పుట్టిన రోజు కానుకగా ఆయన కొత్తసినిమా భగవంత్ కేసరి టీజర్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడారు. బాలకృష్ణ అందరికీ చాలా గౌరవం ఇస్తారని, తెలియని వ్యక్తులు కూడా ఆయనకు విష్ చేస్తే లేచి నిలబడి వారికి షేక్‌హ్యాండ్స్ ఇచ్చి గౌరవిస్తారని, ఎంతపనిలో ఉన్నా ఎవరినీ నిర్లక్ష్యం చేయరని కొనియాడారు. ఆయన చాలా మంచిమనిషి అని, ముక్కుసూటిగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు. తన జనరేషన్ అందరూ బాలకృష్ణకు పెద్ద ఫ్యాన్స్ అని, వీరసింహారెడ్డి సినిమాతో ఆయనను డైరక్షన్ చేసే అవకాశం తనకు కలిగిందని ఆయన వద్దే ఈ పద్దతి నేర్చుకున్నానని, ఎవరొచ్చినా లేచి నిలబడి నమస్కారం చేస్తున్నానని తెలియజేశారు.