Home Page SliderTrending Today

ఇదే అసలైన జెర్సీ మూమెంట్ : నాని

నేచురల్ స్టార్ నాని సినీ ఇండస్ట్రీకి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి..స్వయం కృషితో స్టార్ హీరోగా ఎదిగారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా సత్తా చాటారు హీరో నాని. ఇటీవల నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దసరా నిన్న ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్లు సాధించి రికార్డులు సృష్టించింది. కాగా ఇది నాని కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్ సినిమాగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా విజయంపై నాని ఓ ఆసక్తికర పోస్టర్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేశారు. అదేంటంటే జెర్సీ సినిమాలోని రైల్వేస్టేషన్ సీన్ మూమెంట్ ఫోటోను షేర్ చేస్తూ..”ఇదే అసలైన జెర్సీ మూమెంట్” అని నాని పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.