Home Page SlidermoviesNational

నయనతార జీవితాన్ని మార్చేసిన చిత్రం ఇదేనట

లేడీ సూపర్ స్టార్ నయనతార చిత్రాలకు ఒక ప్రత్యేక డిమాండ్ ఉంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు నయనతార. అయితే తన జీవితాన్ని మార్చేసిన చిత్రంగా తన భర్త విఘ్నేశ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేను రౌడీనే’ అనే చిత్రాన్ని పేర్కొన్నారు. ఈ చిత్రం విడుదలై 9 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆమె ఆ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. తమ జంటను కలిపిన ఈ చిత్రం తన జీవితాన్నే మార్చేసిందన్నారు. తన కెరీర్‌ను గొప్పగా మలచిన చిత్రంగా మరిచిపోలేని అనుభూతులను అందించిందన్నారు. 2015లో విడుదలైన ఈ చిత్రం షూటింగ్ సందర్భంగానే నయనతార, విఘ్నేష్‌లు స్నేహితులయ్యారు. అనంతరం అది ప్రేమగా మారి 2022 జూన్ 9న పెళ్లిపీటలెక్కారు. వీరికి ఇద్దరు కవలపిల్లలు జన్మించారు.