Home Page SliderNational

ఇది 1962 కాదు… చైనాకు అరుణాచల్ సీఎం ఘాటు హెచ్చరిక

అరుణాచల్ సరిహద్దుల్లో చైనా ఆగడాలపై కేంద్రం తీవ్రంగా స్పందిస్తోంది. మరోవైపు పార్లమెంట్లోనూ మొత్తం వ్యవహారంపై చర్చించాలని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ డిమాండ్ చేస్తన్నాయి. ఈ తరుణంలో అరుణాచల్ సీఎం మొత్తం వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అతిక్రమించడానికి ప్రయత్నిస్తే భారత సైన్యం తగిన సమాధానం చెబుతుందని అరుణాచల్ ముఖ్యమంత్రి పెమా ఖండూ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడిన కొద్ది రోజులకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “యాంగ్ట్సే నా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉంది, ప్రతి సంవత్సరం నేను జవాన్లు & గ్రామస్తులను కలుస్తాను. ఇది 1962 కాదు. ఎవరైనా అతిక్రమించడానికి ప్రయత్నిస్తే, వీర సైనికులు తగిన సమాధానం ఇస్తారు” అని ఖండూ ట్వీట్‌లో పేర్కొన్నారు.