ధోనీ ఫీల్డింగ్ మాయ ఇదీ.. హోరెత్తిన స్టేడియం
చెన్నై: వికెట్ల వెనకాల ధోనీ ఎంత చురుకుగా ఉంటాడో మనందరికీ తెలిసిన విషయమే. స్టంపింగ్, రనౌట్, క్యాచ్‌లు ఏవైనా సరే.. టైమింగ్ విషయంలో ధోనీ ప్రత్యేకతే వేరు. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తన సత్తా చాటాడు. డారిల్ మిచెల్ వేసిన బంతిని విజయ్ శంకర్ షాట్ కొట్టే ప్రయత్నంలో బంతి ఎడ్జ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. దీంతో ధోనీ అమాంతం గాల్లో ఎగిరి బంతిని ఒడిసి పట్టాడు. ఇంకేముంది స్టేడియమంతా ఒక్కమారుగా కరతాళ ధ్వనులతో హోరెత్తిపోయింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై చెన్నై 63 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.