‘హెల్త్ కార్డులలో ఈ సమాచారం ఉండాలి’..మంత్రి
తెలంగాణలో హెల్త్ కార్డుల నమోదు విషయంలో కీలక సమాచారం తప్పనిసరిగా నమోదు చేయాలని ఆరోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మొదటగా వ్యక్తుల పేర్లు, అడ్రస్, వారు చేసే వృత్తి వంటి ప్రాధమిక సమాచారం ఉండాలన్నారు. ఆ తర్వాత వారికి గల ఆరోగ్య సమస్యలు, అనారోగ్యాన్ని కలిగించే అలవాట్లు వంటివి నమోదు చేయాలన్నారు. అంతేకాక వారి ఆధార్ యునిక్ నెంబర్, బార్ కోడ్, ఫోటోలతో హెల్త్ కార్డులు తయారు చేయించి, పంపిణీ చేయాలన్నారు.