ఈ యాప్ మోసం..నమ్మకండి
ఎస్‌బీఐ పంపినట్లుగా ఏపీకే ఫైల్స్ ఇన్‌స్టాల్స్ చేసుకోడంటూ మెసేజ్ వస్తోందా..అయితే దీనిని నమ్మకండి. నెట్ బ్యాంకింగ్ ద్వారా రివార్డు పాయింట్లు రెడీమ్ చేసుకునేందుకు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని మెసేజ్‌లు వస్తున్నాయి. అయితే దీనికి ఎస్‌బీఐకి సంబంధం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. ఇలాంటి మెసేజ్‌లు స్టేట్ బ్యాంక్ పంపించదని, ఎలాంటి యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవద్దని, షేర్ చేయవద్దని అవగాహన కల్పించింది. ఇలాంటి మెసేజ్‌లు ఎవ్వరికీ పంపవద్దని పేర్కొంది.