Home Page SliderTelangana

డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగలు పడ్డారు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం జరిగింది. భట్టి విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో బంజారా హిల్స్ లోని ఆయన నివాసంలో బీహార్ కు చెందిన ఇద్దరు దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు. తాళం పగులగొట్టి గోల్డ్, వెండి నగలతో పాటు డబ్బును తీసుకుని దొంగలు పరారయ్యారు. దొంగలను పశ్చిమ బెంగాల్ లో ఖరగ్ పూర్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ వద్ద జీఆర్పీ పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం చేసిన్నట్లుగా ఒప్పుకున్నారు. నిందితులు బిహార్ కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్ పోలీసులు గుర్తించారు. వారి వద్ద 2.2 లక్షల క్యాష్, 100 గ్రాముల బంగారు నాణెం, విదేశీ కరెన్సీ నోట్లు, పెద్ద మొత్తంలో గోల్డ్, వెండి నగలను స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని బంజారా హిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. నిందితులను ఖరగ్పూర్ కోర్టులో హాజరుపరచనున్నారు.