దొంగకు ఆసుపత్రిలో చికిత్స..
సికింద్రాబాద్ గోపాలపురం పీఎస్ పరిధిలో ఓ దొంగకు వింత అనుభవం ఎదురైంది. రెజిమెంటల్ బజార్ లోని ఓ ఇంట్లో రాత్రి సమయంలో దొంగతనంకు యత్నించాడు. కిటికీ లోంచి సెల్ ఫోన్ కాజేయగా… ఇంట్లో వారు నిద్రలేచిన అలికిడి వినిపించడంతో వెంటనే పారిపోయే ప్రయత్నం చేశాడు. దొంగను పట్టుకునేందుకు వారు ఇంట్లో నుంచి బయటకు రాగా.. పట్టుకుంటారని భయపడి బిల్డింగ్ మెట్ల మీద నుంచి కిందకు దూకాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలతో పాటు స్పృహ కోల్పోవడంతో వెంటనే స్థానికులు గోపాలపురం పోలీసులకు సమాచారం అందించి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దొంగతనం కు వచ్చిన వ్యక్తి వీడియోలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.