ఉత్తరాఖండ్ లో నా పేరుతో గుడి ఉంది..
బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె అభిమానులు ఉత్తరాఖండ్ లో తన పేరుతో గుడి కట్టారని కీలక వ్యాఖ్యలు చేసింది. సన్నీ డియోల్, రణదీప్ హుడా నటించిన ‘జాట్’ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసిన ఊర్వశి, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన పేరుతో ఉత్తరాఖండ్ లో ఓ గుడి ఉందని, ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడ తన పేరుతో ఒక గుడిని నిర్మించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్ టెంపుల్ కి వెళ్లినప్పుడు, సరిగ్గా దాని పక్కనే ఒక కిలో మీటర్ల దూరంలో నా పేరుతో గుడి ఉందన్నారు. ప్రజలు ఆ గుడిలో ప్రార్థనలు చేస్తారని, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు కూడా తనను ప్రార్థిస్తారని అలాగే తన ఫోటోలకు పూలమాలలు వేసి ‘దండమమాయి’ అని కూలుస్తారని ఊర్వశి చెప్పింది.