Home Page SliderNational

పోలీసులు చేసిన పని.. ఖైదీ పాలిట వరంగా మారితే..!

బీహర్ పోలీసులు చేసిన పని ఓ ఖైదీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంతకీ అసలు పోలీసులు ఏం చేశారో తెలుసుకుందాం. బీహార్‌లోని కైమూర్‌కి చెందిన కన్హయ్యరాజ్ అనే వ్యక్తి మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో భబువా రోడ్ రైల్వేస్టేషన్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అయితే కన్హయ్యరాజ్ ఒక రోజు జైలు శిక్ష అమలు చేశారు. కాగా ఆయన ఆ జైలు గోడల మధ్య భోజ్‌పూరి పాట పాడారు. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అయితే కన్హయ్యరాజ్ పాట పాడుతుండగా అక్కడి పోలీసులు రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇప్పుడు కన్హయ్య పేరు దేశంలో మారుమ్రోగుతుంది. కన్హయ్య కైమూర్ జిల్లా దహ్రక్ గ్రామానికి చెందినవారిగా తెలుస్తుంది. కన్హయ్య జైల్లో పాడిన పాటను విన్న వారంతా ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే కన్హయ్య మాత్రం తాను మద్యం తాగడం వల్ల అరెస్టు కాలేదనన్నారు. తన పాడుతున్న పాటల్లో అశ్లీలత ఉందని తప్పుగా భావించి ఎవరో ఫిర్యాదు చేశారని కన్హయ్య చెబుతున్నాడు. కన్హయ్య తాను 10 వ తరగతి పాసై 2018 నుంచి పాటలు పాడుతున్నానని తెలిపారు. కాగా జైలులో తాను పాడిన పాట వీడియో వైరల్ కావడంతో పాట పాడటానికి బెనారస్ నుంచి పిలుపు వచ్చిందన్నారు. దీంతో పోలీసులు చేసిని ఈ పని కన్హయ్య పాలిట వరంగా మారిందని నెటిజన్లు పోలీసులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

https://youtu.be/zdj63WiYvMo