మంచు విష్ణుకు కవల కుమారైల అపురూప కానుక
మంచు విష్ణు, ఆయన భార్య విరానికా బుధవారం తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కవల పుత్రికలైన అరియానా, వివియానాలు వారికి సర్‌ప్రైజ్ గిఫ్టునిచ్చారు. అదేంటంటే విష్ణుకు, విరానికాకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్‌ను ఓవీడియోగా మార్చి అందజేశారు. ఈ వీడియోలో ‘మై ఫాదర్ లవ్స్ మై మామ్’ అంటూ పాటను కూడా పాడారు. దీనితో విష్ణు ఎంతో సంతోషంగా ఆనందబాష్పాలు పెట్టుకున్నాడు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన విష్ణు ‘థ్యాంక్యూ డార్లింగ్స్, మీరిచ్చిన ఈ సర్‌ప్రైజ్‌ను ఎప్పటికీ మర్చిపోను’ అంటూ పేర్కొన్నారు. విష్ణు నటించిన ‘జిన్నా’ చిత్రంలో కూడా వీరిద్దరూ ఫ్రెండ్‌షిప్ పాట పాడి ప్రేక్షకులను అలరించారు.

