NationalNews

ఆ ఊరంతా యూట్యూబర్లే.. ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే..

YOU TUBE అనేది ఒక శక్తివంతమైన మీడియా సాధనంగా మారిపోయింది. ఎందుకంటే యూట్యూబ్ వీడియోల రూపంలో ఉంటుంది. చక్కగా చదివే పని లేకుండా అన్ని రకాల INFORMATION తెలుసుకోవచ్చు. భాష తెలియకపోయినా కూడా బెంగలేదు. వీడియోను చూసి అర్థం చేసుకోవచ్చు. అందుకే తక్కువ సమయంలో బాగా ప్రచారంలోకి వచ్చింది యూట్యూబ్. ఈ వీడియోలు ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. సోషల్ మీడియా వినియోగం కొందరికి వినోదాన్ని అందిస్తే.. మరి కొందరికి ఉపాధి మార్గంగా మారింది.

అయితే చత్తీస్ ఘఢ్‌లోని తులసీ అనే గ్రామానికి ఒక ప్రత్యేకత యూట్యూబ్ ద్వారా లభించింది. అదేంటంటే ఈ ఊరిలో దాదాపు అందరూ యూట్యూబర్లే. ప్రతి కుటుంబంలోనూ యూట్యూబ్ వీడియోలు తయారవుతూ ఉంటాయి. దాదాపు 1000 మంది యూట్యూబ్ మీదే పడి బ్రతికేస్తున్నారు. వీరు ఒక్కొక్కరు కేవలం యూట్యూబ్ ద్వారానే నెలకు కనీసం 30 వేల రూపాయలు చొప్పున సంపాదిస్తున్నారు. ఈ గ్రామాన్ని పూర్తిగా యూట్యూబ్ హబ్‌గా మార్చేశారు. సోషల్ మీడియాలో అవగాహన ఉన్న వారందరికీ ఈ గ్రామం గురించిన వీడియోలు సుపరిచితమే. ఈ గ్రామంలో మొత్తం 40 యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. ఇక్కడి స్థానికులు కంటెంట్ సృష్టికర్తలుగా ఎదగడంతో చాలామంది ఈ వీడియోల తయారీలో పాలు పంచుకుంటూ అందరూ సంపాదించుకుంటున్నారు.

ఒక 10 సంవత్సరాల క్రితం ఇద్దరు మిత్రులు ప్రారంభించిన ఈ YOUTUBE  ప్రయాణం ఆసక్తిగా ఉండడంతో ఒక్కొక్కరుగా చేరుతూ వచ్చారు. ఇప్పుడు గ్రామంలోని యువకులంతా యూట్యూబ్ వీడియోలు చేయడంపైనే  వారి దృష్టి సారించారు. ఇదండీ ఈ ఊరికథ.

ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. ఏటా 100 కోట్ల రూపాయలకు పైగా యూట్యూబ్ వల్ల డబ్బు సంపాదిస్తున్నారు.