NationalSpiritual

క్షమాపణలు చెప్పిన బుల్లితెర నటి…

ప్రియాంక జైన్, తన అందంతో, నటనతో బుల్లితెర మీద నటించి మెప్పించింది. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 5 లో నిలిచింది. ఆమె సోషల్ మీడియాలో ఎక్కువ ఆక్టివ్ గా ఉంటారు. తన ప్రియుడు అయిన శివకుమార్ తో కలిసి ఎక్కువగా vlogs చేస్తుంటారు. అందులో కొన్ని ప్రాంక్ వీడియోస్ కూడా ఉంటాయి. అయితే ఆమె తాజాగా తన ప్రియుడితో కలిసి తిరుమలలో ఒక ప్రాంక్ చేసింది. అదేంటంటే, వారిపై పులి దాడి చేసినట్టు ఫేక్ ఆడియో వినిపించారు. పవిత్రమైన దేవస్థానంలో ఇలాంటి ప్రాంక్స్ ఏంటని వీరి దుశ్చర్యపై భక్తులు మండిపడ్డారు. దీనిపై స్పందిస్తూ వారు ఇద్దరు క్షమాపణలు కోరారు. తిరుమల పాదచారుల మార్గంలో తాము రికార్డు చేసిన వీడియో సరదా కోసమేనని, ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా లేదని స్పష్టం చేశారు.