Andhra PradeshHome Page Slider

మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై సుప్రీం కోర్టు అసహనం

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇంకెంత కాలం చేస్తారంటూ సీబీఐని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కేసు రాజకీయ శత్రుత్వమంటూ రిపోర్టులో ప్రస్తావించారని.. హత్యకు కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. వివేకా హత్యలో విచారణాధికారిని మార్చాలని సుప్రీం కోర్టు పేర్కొంది. అధికారిని మార్చడానికి వీలు లేకుంటే.. మరో అధికారిని నియమించాలని సీబీఐకి తేల్చి చెప్పింది. కేసు విచారణకు అవసరమనుకుంటే ఇప్పుడున్న అధికారిని కూడా కొనసాగించండని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. సీబీఐ సమర్పించిన సీల్డ్ కవర్ రిపోర్ట్ మొత్తాన్ని చదివామని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రస్తుతం కేసు మెరిట్స్ మీద ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్ నుంచి కేసు విచారణకు తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. కేసు విచారణను ఈనెల 29కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.