మందుబాబులకు గుడ్ న్యూస్
డిసెంబర్ 31 వేడుకలకు ఏర్పాట్లు చేసుకుంటున్న మందుబాబులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఆ రోజు అర్ధరాత్రి దాకా వైన్ షాపులు తెరుచుకోవచ్చని అనుమతిచ్చింది. బార్లు, రెస్టారెంట్లు రాత్రి ఒంటిగంట దాకా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు, పలు ఈవెంట్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే స్పెషల్ ఈవెంట్లకు పలు షరతులతో అనుమతిచ్చింది. పార్టీలు, పబ్ లలో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించింది. డిసెంబర్ 31 రాత్రి నిర్వహించే ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.