దూసుకెళ్లిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్ దూసుకెళ్తోంది. దేశీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ వరుసగా ఏడో రోజూ లాభాలు నమోదు చేశాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా ఐదో రోజూ ఆల్‌టైమ్ గరిష్ఠాలకు చేరాయి. సెన్సెక్స్ 63,000, నిఫ్టీ 18,800 మైలురాయిని దాటాయి. చివరకు సెన్సెక్స్ 63,099.65.. నిఫ్టీ 18,758.35 వద్ద ముగిశాయి. రెండు సూచీలకూ ఇది రికార్డు ముగింపు. ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, పవర్ గ్రిడ్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్ భారీ లాభాలు నమోదు చేశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ.81.42 వద్దకు చేరుకుంది.