Andhra PradeshHome Page Slider

తిరుపతి లడ్డూలు తయారీ వెనుక రియల్ స్టోరీ

టీడీపీ-వైసీపీ మధ్య రేగిన రాజకీయ పంచాయితీ ఇప్పుడు తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందిన లడ్డూలపై పడింది. చంద్రబాబు వ్యాఖ్యలు, టీడీపీ నేత మీడియా సమావేశం ఆపై టీటీడీ జేఈవో వ్యాఖ్యలు వాటిపై ఇద్దరు మాజీ టీటీడీ ఈవోల వర్షన్, అదే సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, నిగ్గు తేల్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ మొత్తంగా, భక్తుల కొంగు బంగారం శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఏడుకొండల వాడా శ్రీ వేంకటేశ్వరా అంటూ స్వామిని కొలిచే భక్తులు ఇదేం వైపరీత్యమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. తరతరాల శ్రీవారి ప్రతిష్ట మసకబారేలా చేస్తున్నారు? ఇక శ్రీవారి ప్రసాదాన్ని తినేదెలా? బ్రిటీష్ పాలకుల దగ్గర్నుంచి, దండయాత్రల సమయంలోనూ భక్తుల కోరికలు తీర్చిన కోనేటిరాయుడి ఆలయంలో ఏంటీ వైపరిత్యం అంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. మొత్తం వ్యవహారంలో కుట్రదారులెవరు? రాజకీయమేంటి? వాస్తవాలేంటిది నిగ్గు తేల్చాలని అఖలాండకోటి కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు లడ్డూ తయారీకి టీడీపీ అనుసరిస్తున్న ఫార్ములా ఏంటన్నదానిని పరిశీలిద్దాం.. .

మాజీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి పని చేసిన కాలంలో లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించారని ఆరోపించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను వైసీపీ అధినేత జగన్ ఖండించారు. మొత్తం ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక కోరగా, కేంద్ర ఆహార మంత్రి విచారణకు డిమాండ్ చేశారు. తిరుమల ఆలయ వంటశాలలో రోజుకు దాదాపు 1,400 కిలోల నెయ్యితో దాదాపు 3 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. పెద్ద మొత్తంలో జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకులు, శెనగపిండి, చక్కెరను కూడా ఉపయోగిస్తారు.

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్వహించే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ-వేలం ద్వారా లడ్డూల తయారీకి పదార్థాలను కొనుగోలు చేస్తోంది. ఇందుకు దాదాపు ₹ 500 కోట్లు వెచ్చిస్తుంది. టెండరింగ్ వ్యవస్థలో మానవ జోక్యాన్ని తగ్గించడానికి 2022లో టెండరింగ్ ప్రక్రియ ఆన్‌లైన్‌కి మార్చారు. నెయ్యి ట్యాంకర్లు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) ద్వారా ధృవీకరణతో తిరుమల చేరుకుంటాయి. ఇది పరీక్ష విశ్వసనీయంగా జరిగిందని తేలిన తర్వాత వంట గదికి చేరుతుంది. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోడౌన్లలో ఈ సరుకు నిల్వ చేస్తారు. ఈ నెయ్యిని స్వామి వారి లడ్డూ తయారీకి, ఉచిత ఆహార పథకం కోసం వినియోగిస్తారు.

ఏటా స్వామివారి వంట శాల కోసం 6,100 టన్నుల నెయ్యి, 14 టన్నుల చక్కెర, 9,200 టన్నుల శనగపప్పు, 4,680 టన్నుల సోనా మసూరి పప్పు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, యాలకులు, సన్‌ఫ్లవర్ ఆయిన్‌తోపాటు ఇతర పదార్థాలను వాడతారు. ఆంధ్రప్రదేశ్ టెక్నలాజికల్ సర్వీసెస్‌లో నమోదు చేసుకున్న సంస్థలు మాత్రమే ఇ-వేలంలో పాల్గొనడానికి అనుమతిస్తారు. అనేక రకాలుగా యాంక్వైరీలు, విచారణల తర్వాత ఆర్థిక అంశాల ఆధారంగా కాంట్రాక్టులు కేటాయిస్తారు. స్వామివారికి ఆహార పదార్థాలు సప్లై చేసే ఏజెన్సీలకు AGMARK ధృవీకరణ, FSSAI లైసెన్స్‌లు తప్పనిసరి. ₹ 1 కోటి కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఆన్‌లైన్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అవలంబిస్తారు.

వెలుగులోకి వచ్చిన సరుకులో తమిళనాడుకు చెందిన AR డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి 10 ట్యాంకర్ల నెయ్యి ఉంది. అనుమానిత కల్తీ కారణంగా ఆ సంస్థ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని నిలిపివేశారు. నమూనాలను పరీక్షల నిమిత్తం పంపి సరుకును పక్కన పెట్టారు. ఐతే, AR డెయిరీ తన సరుకులు అనేక ల్యాబ్ పరీక్షల క్లియరింగ్ అయ్యాక, అన్ని పరీక్ష నివేదికలు ఆలయానికి పంపిన నెయ్యిని సరఫరా చేస్తామని అది నిరూపించడానికి తమ వద్ద పత్రాలు ఉన్నాయని స్పష్టం చేసింది. తాము తిరుమలకు అందే నెయ్యిలో కేవలం 0.01 శాతం నెయ్యి మాత్రమే సరఫరా చేసినట్లు డెయిరీ తెలిపింది.

లడ్డూలలో జంతువుల కొవ్వు?
తిరుపతి నుండి వచ్చిన నెయ్యి నమూనాలలో చేప నూనె, గొడ్డు మాంసం టాలో, ఒక రకమైన పందికొవ్వు ఉన్నట్లు జూలై 17 నివేదికను టీడీపీ విడుదల చేసింది. తిరుపతి లడ్డూ కూడా నాసిరకం పదార్థాలతో తయారైందని.. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారని ముఖ్యమంత్రి మంగళవారం శాసనసభ సమావేశంలో అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర ఎన్నికలలో ఓడిపోయిన వైఎస్ జగన్, టీడీపీ విమర్శలపై ఎదురుదాడి చేశారు “తప్పుడు నివేదిక” అంటూ మండిపడ్డారు. చంద్రబాబునాయుడు రాజకీయాల కోసం మత విశ్వాసాలు దెబ్బతీస్తున్నారని, రాజకీయంగా లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఐతే చంద్రబాబు వ్యాఖ్యలను టీటీడీ ఈవో కూడా సమర్థించారు. టీటీడీలో నెయ్యి క్వాలిటీ పరీక్షా సౌకర్యం లేకపోవడంతో సరఫరాదారులు ఇలాంటి పనులకు పాల్పడ్డారని, సంబంధిత కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే పనిలో ఉన్నామని తెలిపారు. మరోవైపు మొత్తం వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 25 హక్కుకు విఘాతం కలిగించేలా తిరుమలలో పరిణాలున్నాయంటూ పిటిషన్ దాఖలైంది.