News

కొత్త కారుని ఇంట్లోకి ఇలా తీసుకురావాలన్న మాట

భూమిపై ఉన్న ప్రతిమానవునికి  జీవితంలో ఎన్నో కోరికలు ,ఆశలు ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా చాలామంది సొంత ఇల్లు, కారు కొనుక్కోవాలని కోరికతో ఉంటారు. ఆ కోరికలు నెరవేరే సమయంలో వాళ్లకి కలిగే సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఇటువంటి సందర్భంలో తీసిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా తెలియనప్పటికీ నెటిజన్లను మాత్రం బాగా ఆకట్టుకుంది. ఈ వీడియో విషయానికి వస్తే ఒక వ్యక్తి తాను కొత్తగా కారు కొన్నట్లు తెలుస్తోంది. అయితే అతను ఆ కారు కొని ఇంటి లోపలికి  తీసుకు వస్తున్న సమయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి కారును లోపలికి తీసుకు వస్తుండగా.. ఇంటిలో పార్క్ చేసి ఉన్న టూవీలర్స్ పైకి ఆ కారు దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం చోటు చేసుకోనప్పటికీ… టూవీలర్ వాహనాలు కాస్త దెబ్బతిన్నట్లు కన్పిస్తున్నాయి. ఈ వీడియోను మాజీ భారత వైమానిక అధికారి వినోద్ కుమార్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.