Home Page SliderTelangana

కేటీఆర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన ఎమ్మెల్యే

తెలంగాణా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హైదరాబాద్ హస్తినాపురంలో జరిగిన G.O.118 డీడ్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ సుధీర్ రెడ్డిపై సరదా కామెంట్స్ చేశారు. కాగా కేటీఆర్ మాట్లాడుతూ..ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఘటికుడు అన్నారు. గతంలో సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆహ్వానం పలకగా..18 వేల మంది ప్రజల సమస్య తీర్చాలని కండిషన్ పెట్టాడన్నారు. ఆ తర్వాత పార్టీలో చేరాక కూడా రాజీనామా చేస్తానని..ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడని కేటీఆర్ తెలిపారు.  ఈ మేరకు ఎప్పుడు ఎక్కడ కనబడ్డా..సమయానికి పనికాలేదని,రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తానని సుధీర్ రెడ్డి అనేవారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.