Telangana

డబుల్ డెక్కర్ బస్సులు వచ్చేస్తున్నాయి

నగరంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డబుల్ డెక్కర్ బస్సులు త్వరలోనే సందడి చేయబోతున్నాయి. కొత్త ఏడాది కొత్త జోష్‌తో నగర రోడ్లపైకి రానున్నాయి. గత కొన్నేళ్లుగా నగరవాసుల నుంచి వస్తోన్న డిమాండ్ ఎట్టకేలకు నెరవేరనుంది. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు చారిత్రక నగర వీధుల్లో డబుల్ డెక్కర్ బస్సులను తిప్పేందుకు టీఎస్ఆర్టీసీ కసరత్తులను ముమ్మరం చేసింది. ఫిబ్రవరి 11న జరగనున్న ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ రేస్‌కు ముందే జనవరి 20లోపు ముంబై నుంచి 6 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరానికి రానున్నట్లు సమాచారం