Home Page SliderNational

సుప్రీంకోర్టును ఆశ్రయించిన “ది కేరళ స్టోరీ”మూవీ టీమ్

ది కేరళ స్టోరీ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే.కాగా ఈ సినిమా తెలుగు,తమిళ్,హిందీ,మళయాలం భాషల్లో తెరకెక్కింది. ఈ నేపథ్యంలో ఈ నెల 5న ఈ మూవీ కొన్ని రాష్ట్రాల్లో విడుదలైంది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాకు పన్ను మినహాయింపు కల్పించాయి. అయితే మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాపై నిషేదం విధించాయి.  దీంతో ఈ సినిమాపై నిషేదాన్ని ఎత్తివేయాలని ది కేరళ స్టోరీ చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శనకు థియేటర్ల వద్ద భద్రత కల్పించాలని కోరారు. నిన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సినిమాను తమ రాష్ట్రంలో బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ది కేరళ స్టోరీ చిత్రబృందం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.