Andhra PradeshHome Page Slider

విచారణకు సహకరించాలని లోకేష్‌ను ఆదేశించిన హైకోర్టు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. అమరావతి రింగ్ రోడ్డు ఎలైన్మెంట్‌ కేసులో A 14గా లోకేష్ పేరును సీఐడీ చేర్చింది. దీంతో లోకేష్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. లోకేష్‌కు 41A కింద నోటీసులు ఇస్తామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు విన్పించారు. నిబంధనలు పాటిస్తామని ఏజీ కోర్టుకు వివరించారు. దీంతో బెయిల్ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌కు 41ఏ కింద నోటీసులు అందించేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ బయల్దేరారు. కాసేపట్లో లోకేష్‌కు నేరుగా నోటీసులు ఇవ్వనున్నారు. విచారణకు సహకరించాలని లోకేష్‌కు హైకోర్టు ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న నారా లోకేష్. మరోవైపు ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవల్మెంట్ కేసుల్లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరారు. మధ్యాహ్నం పిటిషన్‌కు విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ అయ్యారు.