క్రూరంగా కుక్కల్ని కొట్టి చంపారు..
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఆకతాయిలు క్రూరంగా ప్రవర్తించారు. వీధికుక్కలపై కర్రలతో దాడిచేసి చంపి పైశాచిక ఆనందం పొందారు. నాలుగు శునకాలను బంధించి కర్రలతో విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఆకతాయిలను గుర్తించే పనిలో పడ్డారు.