లక్ష కోట్లు అప్పు మూడేళ్లకే కూలిపోయింది :మంత్రి ఉత్తమ్
పెండింగ్ లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లో రైతు మహోత్సవం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నిర్మించి ఉంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎంతో ఉపయోగం ఉండేదన్నారు. గత ప్రభుత్వం సాగు నీటి పై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన అదనంగా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని విమర్శించారు. నిజాం సాగర్ ఎస్సారెస్పీ ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ హయాంలోనేనని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరిన్ని చెక్ డ్యాంలు మంజూరు చేస్తాం. రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం సాగుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటుంది. రాష్ట్రాని తాకట్టు పెట్టీ లక్ష కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించారు. బి.ఆర్.ఎస్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడేళ్లకే కూలిపోయింది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.