అందువల్లే ప్రమాదం… తమిళనాడు ఎంపీ సంచలన ఆరోపణలు
చెన్నైలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ షో తర్వాత హీట్ స్ట్రోక్ కారణంగా ఐదుగురు మరణించడం చాలా బాధాకరమని, అనవసరంగా అంతమందిని పోగేశారని, వారి చావులకు కారణమయ్యారన్నారు డీఎంకే ఎంపి కనిమొళి. 15 లక్షల మంది ప్రేక్షకులను ఒకచోట చేర్చి ప్రపంచ రికార్డు సృష్టించాలన్న లక్ష్యం, అమాయకుల మృతికి కారణమన్నారు. వైమానిక దళం 92వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచంలోని అతి పొడవైన బీచ్, మెరీనా బీచ్‌లో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పేందుకు ఈవెంట్‌ను ఎయిర్ ఫోర్స్ ప్లాన్ చేసింది. ఎండ వేడిమి ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల ఎక్కువగా ఉండటంతో కొందరు వేడి గాలులు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. మెరీనా బీచ్ రహదారి వెంట ఉన్న ఎలివేటెడ్ MRTS రైల్వే స్టేషన్లు జనసద్రంగా మారాయి. రద్దీగా ఉండే రోడ్లపై 3-4 కిలోమీటర్లు నడవాల్సి రావడంతో ప్రమాదం జరిగింది.

