Home Page SliderInternational

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్ నెంబర్ ప్లేట్ ధర రూ.122 కోట్లు

ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని విభిన్న వస్తువులు, ఖరీదైన వాహనాలకు వేలం నిర్వహించినప్పుడు అవి అత్యంత ఖరీదుతో అమ్ముడుపోయి అందరిని షాక్ గురిచేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఓ కారు నెంబర్ ప్లేట్‌కు వేలం నిర్వహించారు. అయితే దీని ధర వంద కోట్లు దాటింది. ఏంటి కార్ ప్లేట్ ధర వందకోట్లు దాటిందా ? అని ఆశ్చర్య పోతున్నారా? మీరు నమ్మినా..నమ్మకపోయినా ఇది నిజమండీ. అయితే దుబాయ్‌లోని ఓ కారు ప్లేట్ ధర ఏకంగా రూ.122కోట్లు పలికి రికార్డు సృష్టించింది. దీంతో ఈ కార్ నెంబర్ ప్లేట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన నెంబర్ ప్లేట్‌గా రికార్డుల కెక్కింది. కాగా దుబాయ్‌కి చెందిన ఓ సంస్థ వేసిన వీఐపీ కార్ నెంబర్ ప్లేట్ల వేలంలో “p7” అనే నెంబర్ ప్లేటు 55 మిలియన్ దిర్హామ్(రూ.122 కోట్లు)లకు అమ్ముడు పోయింది. దీంతో  ప్రపంచంలో ఇప్పటివరకు అమ్ముడుపోయిన అత్యంత ఖరీదైన నెంబర్ ప్లేట్ ఇదే కావడం విశేషం.