Andhra PradeshHome Page Slider

‘ప్రకాశం బ్యారేజ్ కూల్చివేతకే ఆ కుట్ర’..హోంమంత్రి

ప్రకాశం బ్యారేజ్ కూల్చివేత కోసం కుట్ర జరిగిందని ఏపీ హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.  వరదలో కొట్టుకొచ్చిన నాలుగు బోట్లు మానవ తప్పిదం వల్లే వచ్చాయన్నారు.  పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిసాయని పేర్కొన్నారు. ఆ బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని, ఇది కుట్రకోణంలాగే అనిపిస్తోందన్నారు. అవి వైసీపీ నేతలు నందిగం సురేష్, తలశిల రఘురాం బంధువుల బోట్లుగా గుర్తించామన్నారు. ఈ బోట్ల వ్యవహారంపై వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. విచారణలో ఇది కావాలని చేసినదయితే ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదన్నారు. వారిపై దేశద్రోహం కేసులు పెడతామన్నారు.