భవనం కుప్పకూలింది..
కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. శిథిలాల కింద 12 మంది చిక్కుకున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మంగళవారం బాబుపాల్య వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇప్పటివరకు ముగ్గురిని రక్షించాయి. మిగతావారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భవనం కింద చిక్కుకున్న వారిలో పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కర్నాటక డిప్యూటీ సీఎం డీకే. శివ కుమార్ స్పందించారు. ప్రకృతిని ప్రభుత్వం ఆపలేదన్నారు. అయితే, ప్రజలు ఇబ్బంది పడకుండా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రెస్క్యూ బృందాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొన్నారు.