Home Page SliderNational

మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 88 పరుగుల ఆధిక్యం

మూడో టెస్ట్ తొలి రోజు భారత టాప్ ఆర్డర్ కుప్పకూలడంతో… ఇండియా చేతులెత్తేస్తుందేమోననిపించింది. ఐతే భారత బౌలర్లు రాణించి.. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు కట్టడి చేశారు. 156కి 4 వికెట్లతో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఇవాళ 41 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 6 వికెట్లను కోల్పోయింది. ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా లంచ్ సమయానికి వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇండియా 109 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో 88 పరుగులు ఆధిక్యం లభించింది. మూడో టెస్టులో టీమ్ ఇండియా గెలవాలంటే కనీసం కనీసం 90 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే 350 పరుగులు తక్కువలో తక్కువ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా గెలవగలుగుతుంది.