కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులతో డేంజర్: ప్రధాని మోడీ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లు రెచ్చిపోతుంటారని ప్రధాని మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిష్రాంపూర్ సభలో మాట్లాడుతూ నక్సలైట్ల హింసను నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు చేతులు ఎత్తేసిందన్నారు. ప్రజలకు ఆ పార్టీ ద్రోహం చేయడం తప్ప ఏ చర్యలు తీసుకోదు. యువత కలలను కూడా నెరవేర్చడం లేదు. వారు మహాదేవ్ పేరుతో చేసిన బెట్టింగ్ స్కామ్ దేశ విదేశాల్లో చర్చనీయాంశమవుతోంది అని తీవ్రంగా దుయ్యబట్టారు.

