Home Page SliderInternational

పాకిస్తాన్ లో ఉగ్రదాడి..

పాకిస్తాన్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రహదారిని అడ్డగించి బస్సులో ఉన్న ప్రయాణికులను బలవంతంగా కిందకి దించి వారి ఐడెంటీటీ చెక్ చేసి తుపాకులతో టెర్రరిస్టులు కాల్చి చంపారు. అంతే కాకుండా రోడ్డుపై ఉన్న 10 వాహనాలను నిప్పు పెట్టారు.బలూచిస్థాన్ రాష్ట్రంలో రరాషమ్ జిల్లా ముసాఖేల్ సమీపంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. చనిపోయిన 23 మందిలో చాలా మంది పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల దాడి తామే చేసినట్లు ఏ టెర్రరిస్ట్ గ్రూప్ కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ ఘటనను ఖండిస్తూ బలూచిస్థాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తీ చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి, సంతాపం తెలిపారు. ఇంత దారుణానికి తెగపడిన ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేదే లేదని పాక్ మంత్రి అత్తావుల్లా తరార్ అన్నారు.