ఏపీ బంద్ కు తెలుగుదేశం పార్టీ పిలుపు
వైయస్సార్సీపీ కక్షపూరిత రాజకీయాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చే నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు అక్రమ అరెస్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ తరఫున పిలుపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ధమనకాండ ప్రజాస్వామ్య విలువల హననానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని బంద్ నిర్వహణకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ బంద్ కు జనసేన పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన అరెస్టును జనసేన పార్టీ ఇప్పటికే ఖండించింది.

