జనవరి లో తెలంగాణా టెట్ ఎగ్జామ్స్
తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటి ఎగ్జామ్స్ కి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్‌ని రిలీజ్ చేశారు. ఈ ఏడాది నవంబర్ 5 నుంచి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.ఆసక్తి గల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.