Home Page SliderTelangana

తెలంగాణ సచివాలయం ప్రారంభం ఖరారు! ఎప్పుడంటే?

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఏప్రిల్ 30న ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. కొత్త సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుగా నామకరణం చేశారు. ఇక జూన్ 2న తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని సైతం ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. సచివాలయాన్ని గతంలోనే ప్రారంభించాలనుకున్నా… అగ్ని ప్రమాదం జరగడం, నిర్మాణ పనులు నత్తనడకన సాగటం, కోర్టులో పిటిషన్లతో వాయిదా పడుతూ వస్తోంది. కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారని గతంలో ప్రచారం జరిగింది.

సచివాలయ నమూనా (గ్రాఫిక్స్)