84వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన తెలంగాణ అధికారి
84 వేలు లంచం తీసుకుంటుండగా తెలంగాణ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. కె జగజ్యోతి చేయాల్సిన పనులు చేసేందుకు లంచం తీసుకుంటున్నారని… వ్యక్తి నుంచి ఫిర్యాదుతో ఏసీబీ కదిలింది. శరవేగంగా ఆపరేషన్ నిర్వహించి నిర్ణీత మొత్తాన్ని అందజేసే క్రమంలో సదరు అధికారిని పట్టుకుంది. ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకోవడంతో కళ్ల నీళ్ల పర్యంతమైన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కె జగజ్యోతి, ఫినాలఫ్తిలీన్ పరీక్ష చేయడంతో ఆమె నేరం రుజవయ్యింది. కుడి చేతి వేళ్లు పాజిటివ్ అని తేలింది. ఫినాలఫ్తిలీన్ అనే రసాయన సమ్మేళనం విచ్ఛిన్నమైనప్పుడు, గులాబీ రంగులోకి మారుతుంది. ఇది లంచం గ్రహీతలను పట్టుకోవడంలో విలువైన సాధనంగా ఏసీబీ వినియోగిస్తుంది. ఎవరైనా గుర్తించబడిన బిల్లులు లేదా డాక్యుమెంట్‌లను హ్యాండిల్ చేసినప్పుడు, సొల్యూషన్ జాడలు వారి చేతులకు అంటుకుంటాయి. ఆ వస్తువును తాకినప్పుడు గులాబీ రంగు కనిపిస్తుంది. అనధికారిక ప్రయోజనం పొందాలంటే.. లంచం ఇవ్వాల్సిందేనని… జగజ్యోతి కోరారని, విధుల నిర్వహణలో అనుచితంగా వ్యవహరించారని ఏసీబీ పేర్కొంది. అరెస్టు తర్వాత, ఆమె వద్ద నుండి ₹ 84,000 లంచం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను హైదరాబాద్‌లోని కోర్టులో హాజరుపరచనున్నారు.