Home Page SliderTelangana

ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించిన తెలంగాణ హైకోర్టు

ఎమ్మెల్యేల ఎర కేసులో సంచలనం నమోదయ్యింది. కేసును సీబీఐకి అప్పగించింది. తెలంగాణలో సంచలనం రేపిన ఫామ్ హౌజ్ ఎపిసోడ్‌కు తెలంగాణ హైకోర్టు సరికొత్త ట్విస్ట్ ఇచ్చింది. కేసును తక్షణం సీబీఐకి బదిలీ చేయాలని సిట్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల ఎర కేసు కీలక మలుపు తీసుకొంది. కేసు విచారణలోంచి సిట్‌ను తెలంగాణ హైకోర్టు తప్పించింది. కేసును సీబీఐకు బదిలీ చేయాలంది. కేసును సీబీఐకి లేదంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారించాలని బీజేపీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అంగీకరించింది. ఇక ఎమ్మెల్యేల వ్యవహారంలో మొత్తం కేసును సీబీఐ విచారించనుంది. మొత్తం వ్యవహారంలో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజకీయంగా సున్నితమైన ఈ కేసును విచారిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా హైకోర్టు రద్దు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ నేత, న్యాయవాది ఎన్. రామ్‌చందర్‌రావు అన్నారు.