Home Page SliderTelangana

జూన్ 27 నుంచి తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశ ప్రక్రియ జూన్ 20 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. మొదటి దశ కౌన్సెలింగ్ జూన్ 27న ప్రారంభమవుతుంది. విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్‌లను జూన్ 30 నుండి ఉపయోగించుకోవచ్చు. మొదటి దశకు సీట్ల కేటాయింపు జూలై 12న ఉంటుంది. రెండవ దశ కౌన్సెలింగ్ జూలై 19న ప్రారంభమవుతుంది. సీట్ అలాట్‌మెంట్ తేదీ జూలై 24. చివరి దశ కౌన్సెలింగ్ జూలై 30న, సీట్ల కేటాయింపు ఆగస్టు 5న. ఇంటర్నల్ స్లయిడింగ్ ప్రక్రియ ఆగస్టు 16న, సీట్ల కేటాయింపు ఆగస్టు 16న. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్ మార్గదర్శకాలు జారీ చేస్తారు.

జూన్ 27 నుంచి ఇంజినీరింగ్ కాలేజీల ప్రవేశాల ప్రక్రియ

జూన్ 30 నుంచి మొదటి విడత వెబ్ అప్షన్లకు ఛాన్స్

జులై 12న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

జులై 19న సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్

జులై 24న సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు

జులై 30న ఫైనల్ కౌన్సెలింగ్

ఆగస్టు 5న తుది విడత ఇంజినీరింగ్ సీట్లు కేటాయింపు

కన్వీనర్ ద్వారా ఆన్ లైన్లో ఇంటర్నల్ స్లైడింగ్

ఆగస్టు 12 నుంచి ప్రక్రియ, ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్ల కేటాయింపు

ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు