Home Page SliderPoliticsTelangana

తెలంగాణ మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావం జరిగిన మరుసటి రోజే… తెలంగాణ కేబినేట్‌ భేటీ కావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు, రైతు బంధు నిధుల విడుదల, దళిత బంధు తదితర అంశాలపై చర్చించనున్నారు. సొంతింటి స్థలం ఉన్న నిరుపేదలకు 3 లక్షల ఆర్థిక సాయం ఇవ్వడంపైనా కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా చర్చ చేసే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. పోడు భూములకు పట్టాలు పంపిణీ తేదీల ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు గత అసెంబ్లీ సమావేశాల్లో సభ ఆమోదించిన 6 బిల్లులకు గవర్నర్‌ ఇప్పటి వరకు ఆమోదం కాలేదు. ఈ 6 బిల్లులపై ఎలా ముందుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ ఈ కేబినెట్‌ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.