మెల్బోర్న్ టెస్ట్ లో టీం ఇండియా ఓటమి
నితీష్ రెడ్డి వీరోచిత పోరాటం వృధా అయిపోయింది.కీలకమైన నాలుగో టెస్ట్ ఐదో రోజు ఆటలో టీం ఇండియా ఆటగాళ్లు తడబడిపోయారు. 154 పరుగులకే చేతులెత్తేశారు.ఇక వరల్డ్ టెస్ట్ ఫైనల్ ఆశలు గల్లంతైనట్లే.ఏదో మ్యాజిక్ జరిగి ఆస్ట్రేలియా టీం రానున్న టెస్టుల్లో ఘోర పరాభవానికి గురయితే తప్ప…భారత్ ఆశలు సజీవంగా ఉండే పరిస్థితులు లేనట్లే కనిపిస్తున్నాయి. చేజేతులారా వచ్చిన అకాశాన్ని టీం ఇండియా దుర్వినియోగం చేసుకుంది. కేవలం ఒక వికెట్ తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 234 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్..వెనువెంటనే వికెట్లను కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్,మిడిలార్డర్ పేలవ ప్రదర్శనతో ఫైనల్ ఆశలను నీరుగార్చేసుకుంది. దీంతో ఇండియన్ క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశానిస్పృహల్లోకి వెళ్లారు.