పలువురు రెబల్స్‌పై వేటు వేసిన టీడీపీ
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేతలను టీడీపీ సస్పెంట్ చేసింది. ఇందుకు సంబంధించి ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఓ ప్రకటన చేశారు. అరకు నియోజకవర్గానికి సంబంధించి సివేరి అబ్రహం, విజయనగరానికి చెందిన మీసాల గీత, అలాపురానికి చెందిన పరమట శ్యాంకుమార్, పోలవరానికి చెందిన ముడియం సూర్యచంద్రరావు, ఉండికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు, సత్యవేడుకు చెందిన జడ్డా రాజశేఖర్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంత మంది నేతలు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడం ఇటీవల కాలంలో ఇదేనంటున్నారు నిపుణులు. గతంలో ఎన్నడూ చంద్రబాబు నిర్ణయాన్ని నేతలు విభేదించాలంటే వెనుకాముందు ఆడేవారు. అయితే తాజాగా ఇంత మంది నేతలు, ఎంతగా చెప్పినప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేయడంపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.