Andhra PradeshHome Page Slider

తొలి జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన టీడీపీ ఎంపీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినప్పటి నుంచి రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన జీతాన్ని అమరావతి నిర్మాణానికి  విరాళంగా ఇచ్చారు.అయితే అప్పలనాయుడు ఎంపీగా ఇటీవల తన తొలి జీతం రూ.1.57లక్షలను అందుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో ఆయన ఆ చెక్కును ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఎంపీ అప్పలనాయుడిని అభినందించారు.