టీడీపీ నేతకు గుండెపోటు
టీడీపీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. కాగా ఆయనకు ఈ రోజు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేష్ హాస్పటల్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యలు తెలిపారు. యాంజియోగ్రామ్ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు,కార్యకర్తలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.